సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

09-04-2021 Fri 07:27
  • పవన్ రీమేక్ సినిమాలో నిత్య మీనన్ 
  • కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన రవితేజ
  • సంక్రాంతికి రానున్న మణిరత్నం చిత్రం
Nitya Menon to play love interest for Pawan

*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో ఆయన సరసన నిత్య మీనన్ ని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో జంటగా రానా, ఐశ్వర్య రాజేశ్ నటిస్తారు.
*  ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. ఆ తర్వాత ప్రాజక్టును ఓ కొత్త దర్శకుడితో  చేస్తాడని సమాచారం. దీనిని 'విరాటపర్వం' నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.  
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం ఇప్పటికి 70 శాతం షూటింగును పూర్తిచేసుకుంది. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.