మా అమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో రేపు థియేటర్ కు వెళ్లి 'వకీల్ సాబ్' చూడబోతున్నా: చిరంజీవి

08-04-2021 Thu 16:34
  • రేపు 'వకీల్ సాబ్' విడుదల
  • రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
  • మూడేళ్ల తర్వాత పవన్ చిత్రం
  • అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నట్టు చిరు వెల్లడి
  • సినిమా ఎలా ఉందో రేపు చెబుతానంటూ వ్యాఖ్య 
Chiranjeevi says he will watch Vakeel Saab tomorrow along with mother and other family members

పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం అంబరాన్నంటుంతోంది. అందుకు కారణం, మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం రేపు రిలీజ్ అవుతుండడమే. ఈ సినిమా విడుదలపై పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

చాలాకాలం తర్వాత పవన్ కల్యాణ్ ను వెండితెరపై చూడడానికి అభిమానులందరి లాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని అన్నారు. అమ్మ అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రేపు సాయంత్రం థియేటర్ లో 'వకీల్ సాబ్' చిత్రం చూడబోతున్నానని చిరంజీవి తెలిపారు. 'ఈ సినిమా ఎలా ఉందో నా అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి తహతహలాడుతున్నాను. వేచి చూడండి' అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఫొటోను కూడా పంచుకున్నారు. పవన్ కెరీర్ తొలిరోజుల నాటి ఫోటోను ట్వీట్ కు జత చేశారు. ఆ ఫొటోలో పవన్ హెయిర్ స్టయిల్ ను దువ్వెనతో సరిచేస్తున్న చిరంజీవిని చూడొచ్చు.