సవాళ్లు చేస్తే నాయకులు కాలేరు... ప్రజల్లో గెలిస్తేనే అవుతారు: అంబటి

08-04-2021 Thu 16:05
  • వివేకా హత్యకేసుపై లోకేశ్ స్పందన
  • దేవుడిపై ప్రమాణం చేయగలరా? అంటూ సీఎం జగన్ కు సవాల్
  • పరోక్ష వ్యాఖ్యలు చేసిన అంబటి
  • తండ్రిని అడ్డంపెట్టుకుని మంత్రి అయ్యాడంటూ విమర్శలు
  • కనకపు సింహాసనమున శునకం అంటూ ఎద్దేవా
Ambati Rambabu slams opposition leaders

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విపక్ష నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొద్దబ్బాయిలు, బొడ్డు కూడా ఊడని మరుగుజ్జు నాయకులు చేసే సవాళ్లు ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగినట్టే ఉంటాయని విమర్శించారు. అయినా సవాళ్లు చేస్తే నాయకులు కాలేరని, ప్రజల్లో గెలిస్తేనే నాయకులు అవుతారని అంబటి స్పష్టం చేశారు. తండ్రిని అడ్డంపెట్టుకుని మంత్రి పదవిని చేపడితే అది కనకపు సింహాసమున శునకము తీరుగానే ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఏపీలో గత కొంతకాలంగా అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో తమ ప్రమేయం లేదని సీఎం జగన్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేయగలరా? అని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.