వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలి: చంద్రబాబు

08-04-2021 Thu 15:33
  • వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్
  • ప్రశ్నిస్తే వేధిస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు
  • బెదిరింపు కాల్స్ దోషులను శిక్షించాలని డిమాండ్
Chandrababu demands security for Varla Ramaiah and his family

ప్రశ్నిస్తే వేధిస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ వ్యవహారంపై ఆయన స్పందించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరవైందని విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని...  వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.

వర్ల రామయ్య బెదిరింపు కాల్స్ పై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.