ఏపీ టీడీపీని ఇక బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే: విజ‌య‌సాయిరెడ్డి సెటైర్
Add ap7am to your home Screen

ఏపీ టీడీపీని ఇక బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే: విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

vijay sai reddy slams tdp
  • పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్నారు
  • చంద్రంకు ఇక నిరాశ, నిస్పృహే
  • చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?
టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఏపీ టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'టీఆర్ఎస్‌లో తెలంగాణ టీడీపీ విలీనమైంది, టీడీఎల్పీని మూసేశారు. ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే. లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా? పప్పు  నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశా, నిస్పృహే. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్‌పైన కూడా విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 'జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పేద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే' అని విజ‌య‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News