హైదరాబాదు అఫ్జల్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం

07-04-2021 Wed 15:13
  • ఓ టైర్ల గోడౌన్ లో అగ్నిప్రమాదం
  • పక్కనే పెట్రోల్ బంకు
  • వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
  • భారీ ఆస్తినష్టం జరిగినట్టు అంచనా
Huge fire accident in Hyderabad

ఎండలు మండిపోతున్న ఈ వేసవిలో అగ్నిప్రమాదాల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. తాజాగా హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అఫ్జల్ గంజ్ లోని బడేమియా పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ఓ టైర్ల గోడౌన్ అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.