AP High Court: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. రేప‌టి ఎన్నిక‌లు య‌థాత‌థం

 trial in high court on elections
  • ఎన్నిక‌ల‌ను నిలిపేస్తూ ఇటీవ‌ల‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్త‌ర్వులు
  • డివిజ‌న్ బెంచ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌
  • సింగిల్‌ జడ్జి ఉత్త‌ర్వులను కొట్టేసిన డివిజ‌న్ బెంచ్‌
  • ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించవద్దని ఆదేశం 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజ‌న్ బెంచ్ ‌కు అప్పీల్‌ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్వ‌ర్వుల‌ను డివిజ‌న్ బెంచ్ కొట్టివేసింది. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని హైకోర్టు తెలిపింది. దీంతో రేపు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు య‌థాత‌థంగా జ‌ర‌గ‌నున్నాయి. అయితే, త‌మ నుంచి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని హైకోర్టు ఆదేశించింది.

కాగా, ఇటీవ‌ల‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి డివిజ‌న్ బెంచ్ ను కోరిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయా అంశాల‌పై ప్ర‌తివాదుల త‌ర‌ఫున వాద‌న‌లు కొన‌సాగాయి. టీడీపీ నేత‌ వర్ల రామయ్య తరఫున‌ సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్ర‌హ్మ‌ణ్యం తమ వాదనలను వినిపించారు.
AP High Court
Andhra Pradesh
ZPTC
MPTC
Local Body Polls
sec

More Telugu News