Nandigam Suresh: సిగ్గు, శరం లేకుండా ఢిల్లీలో ఉంటున్నాడు!: రఘురామకృష్ణరాజుపై నందిగం సురేశ్ వ్యాఖ్యలు

Nandigam Suresh terms CM Jagan as lord Rama
  • జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ
  • కోర్టులో పిటిషన్ దాఖలు
  • స్పందించిన వైసీపీ ఎంపీ నందిగం సురేశ్
  • రఘురామకృష్ణరాజు మరింత దిగజారిపోయాడని విమర్శలు
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడంపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. జగన్ రాముడో, రాక్షసుడో తేలితేనే ఏపీకి వస్తానని రఘురామకృష్ణరాజు అంటున్నాడని, జగన్ రాముడని ప్రజలు ఎప్పుడో తేల్చారని స్పష్టం చేశారు. సీఎం రాముడితో సమానం కాబట్టే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనమైన తీర్పు ఇచ్చారని వివరించారు.

రఘురామకృష్ణరాజు పిటిషన్ పై కథనాలు వెలువరించిన ఓ వర్గం మీడియా... సాయంత్రానికే పిటిషన్ కొట్టివేసిన సంగతి గురించి ఎందుకు వార్తలు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుపైనా అనేక సీబీఐ కేసులు ఉన్నాయని, తనను చంద్రబాబో లేక ఏదైనా పార్టీనో కాపాడకపోతుందా అని ఇంతగా దిగజారాడని అన్నారు. పక్క పార్టీలకు, ఇతర పార్టీల నేతలకు దాయాదిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

రఘురామకృష్ణరాజును పైనున్న దేవుడు కూడా క్షమించబోడని, జైలుకు వెళ్లడం ఖాయమని నందిగం స్పష్టం చేశారు. సిగ్గు, శరం లేకుండా ఢిల్లీలో ఉంటున్న రఘురామకృష్ణరాజు... ఆత్మగౌరవం ఉంటే ఏపీకి రావాలని అన్నారు. రఘురామకృష్ణరాజు వేల కోట్లలో బ్యాంకులను మోసం చేశాడని, ఇలాంటి వాళ్లపై చర్యలు తప్పకుండా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nandigam Suresh
Lord Rama
Jagan
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh

More Telugu News