Varma: నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు... తన డెత్ డే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్!

Not My Birth Day its my death day Ramgopal Varma comment
  • శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు
  • నా ఆయుష్షులో మరో ఏడు తగ్గిపోయింది
  • ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాభినందనలు తెలుపుతున్న వేళ, తనదైన శైలిలో కామెంట్ చేస్తూ, ట్విట్టర్లో వర్మ పెట్టిన ఓ కామెంట్ వైరల్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, ఫ్యాన్స్ ఆయనకు విషెస్ చెబుతూ ఉన్న వేళ, ఆయన ఓ కొంటె కామెంట్ చేశారు.

"నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది" అంటూ ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఏడుపు మొహం ఎమోజీని సైతం తగిలించారు. వర్మ ట్వీట్ ను చూసిన పలువురు వెరైటీగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ రూటే సపరేటని కామెంట్లు వస్తున్నాయి.
Varma
Ram Gopal Varma
Birth Day
Death Day
Twitter

More Telugu News