'గాలి సంపత్' పాత్రకు రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ నటుడి అవార్డు!

07-04-2021 Wed 07:04
  • ఇటీవల విడుదలైన 'గాలి సంపత్'
  • ఉత్తమ నటిగా మౌర్యానీ
  • ఉత్తమ దర్శకుడిగా కేవీఆర్ మహేంద్ర
Actor Rajendra Prasad Gets Best Actor Award for Gali Sampath

ఇటీవల విడుదలైన 'గాలి సంపత్' చిత్రంలో తన నటనకు గాను రాజేంద్ర ప్రసాద్, ఉత్తమ నటుడి అవార్డును అందుకోనున్నారు. ప్రముఖ సాహితీ సంస్థ ‘బల్లెం వేణుమాధవ్‌ ఆర్ట్‌ థియేటర్‌’ సినీ ప్రముఖులకు అవార్డులను ప్రకటించగా, బెస్ట్ యాక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ నిలిచారు.‌

ఉత్తమ నటిగా మౌర్యాని (దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ), ఉత్తమ చిత్రంగా దేవర కొండలో విజయ్‌ ప్రేమకథ, ఉత్తమ దర్శకుడుగా కేవీఆర్. మహేంద్ర (దొరసాని) నిలిచారు. ఇదే సమయంలో ఉత్తమ నూతన దర్శకుడుగా శైలేష్‌ తివారి (బాలమిత్ర)ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.