27న నా నిశ్చితార్థం: నటి రాయ్ లక్ష్మి

07-04-2021 Wed 06:25
  • నా రిలేషన్ షిప్ ను దాచుకోవడం లేదు
  • ఇన్విటేషన్లను ఇప్పటికే పంపించాను
  • అనుకోకుండా డేట్ ఫిక్సయిందన్న రాయ్ లక్ష్మి
Actress Rai Lakshmi Engagement on 27th

నటి రాయ్ లక్ష్మి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 27న ఆమె ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. చాలా కాలంగా పెళ్లి ఎప్పుడన్న విషయమై తనను ఎందరో ప్రశ్నిస్తున్నారని, తానేమీ దాచుకోవాలని భావించడం లేదని, తాను ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నానని, 27న నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్లను ఇప్పటికే సన్నిహితులకు పంపించానని, ఇది ముందుగా ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని, అనుకోకుండా నిశ్చయమై పోయిందని పేర్కొంది. తన ప్రియుడితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమవుతున్నానని, తన వివాహ నిశ్చయంపై బంధు మిత్రులంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.