Ajith: సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కున్న హీరో అజిత్

Hero Ajith gets angry on a youth while casting his vote
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న అజిత్
  • సాధారణ పౌరుడిలా క్యూలో నిల్చుని ఓటేసిన వైనం
  • ఫొటోలు తీసేందుకు పోటీలు పడిన ఫ్యాన్స్
  • మాస్కు ధరించిన అభిమానిపై అజిత్ ఆగ్రహం  
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.

ఈ క్రమంలో ఓ అభిమాని మరీ ముందుకొచ్చి అజిత్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడు మాస్కు లేకుండా కనిపించడంతో ఆగ్రహించిన అజిత్ ఆ యువకుడి నుంచి ఫోన్ లాక్కొన్నారు. ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపలికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ ను తిరిగి అభిమానికి ఇచ్చేశారు. వెళుతూ వెళుతూ క్షమాపణ కూడా చెప్పారు. దాంతో ఆ అభిమాని ఓకే సార్ అంటూ స్పందించాడు.
Ajith
Selfie
Phone
Fan
Chennai
Voting
Tamilnadu

More Telugu News