Earthquake: సిక్కింలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు

  • రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదు
  • సిక్కిం రాజధానికి 25 కి.మీ దూరంలో భూకంప కేంద్రం
  • అసోం, బెంగాల్‌, బిహార్‌లోనూ కంపించిన భూమి
  • నేపాల్, భూటాన్‌లోనూ భూప్రకంపనలు
Earthquake in Sikkim

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. గ్యాంగ్‌టక్‌కి 25 కి.మీ దూరంలో ఈస్ట్‌-సౌత్‌వెస్ట్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. రాత్రి 8:49 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

ఈ భూకంపం ధాటికి సిక్కింతో పాటు పొరుగు రాష్ట్రాలైన అసోం, బెంగాల్‌, బిహార్‌లోనూ భూమి కంపించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నేపాల్‌, భూటాన్‌లోనూ భూప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించారు.

ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. మొత్తం గ్యాంగ్‌టక్‌ నగరాన్ని కుదుపునకు గురిచేసిందని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన సమాచారం లేదు.

More Telugu News