వామ్మో, ఇలాంటోడ్ని ఎక్కడా చూడలేదు... నా ఓటు నోముల భగత్ కే: ఆర్జీవీ వ్యాఖ్యలు

03-04-2021 Sat 22:01
  • నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
  • ఆసక్తికర వీడియో పంచుకున్న వర్మ
  • చిరుతపులితో నోముల భగత్ వాకింగ్
RGV comments on Nomula Bhagat

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పోటీ చేస్తున్నారు. అయితే నోముల భగత్ కు చెందిన ఓ వీడియో చూసి దర్శకుడు రాంగోపాల్ వర్మ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ వీడియోలో భగత్ ఓ చిరుత పులితో సరదాగా వాకింగ్ చేస్తున్న దృశ్యాలున్నాయి.

దీనిపై వర్మ స్పందిస్తూ... "వామ్మో... మనం ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ లను పులి, సింహం అని భావించాం. కానీ చిరుతపులితో వాకింగ్ చేస్తున్న ఈ కాండిడేట్ నోముల భగత్ మామూలోడు కాదు. అతడ్ని నేను ఇష్టపడుతున్నాను. నాగార్జునసాగర్ లో గనుక నాకే గనుక ఓటు ఉంటే నా ఓటు నిస్సందేహంగా నోముల భగత్ కే" అని వర్మ స్పష్టం చేశారు.

"ప్రపంచ చరిత్రలో ఇలా చిరుతపులిని పట్టుకుని ప్రచారం చేస్తున్న నేతను ఎక్కడా చూడలేదు... హ్యాట్సాఫ్ టు కేసీఆర్, కేటీఆర్" అంటూ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ బరిలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది.