కరోనా బారిన పడిన 'వకీల్ సాబ్' భామ

03-04-2021 Sat 20:49
  • టాలీవుడ్ లో కరోనా కలకలం
  • నివేదా థామస్ కు కొవిడ్ పాజిటివ్
  • ఐసోలేషన్ లో ఉన్నానంటూ నివేదా వెల్లడి
  • అందరికీ ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు
Niveda Thomas tested corona positive

టాలీవుడ్ లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా అందాలభామ నివేదా థామస్ కూడా కరోనా బాధితుల జాబితాలో చేరింది. ఆమెకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని నివేద స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది.

తన వైద్య బృందం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నివేద పేర్కొంది. ఈ సమయంలో తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్టు చేసింది. నివేదా థామస్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ప్రధానపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.