Bollywood: నిశ్చితార్థం తర్వాత బ్రేకప్... పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించిన బాలీవుడ్ నటి సబా కమర్

Pakistani actress Saba Qamar calls off wedding with fiance
  • ‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్‌లోకి  సబా కమర్ అడుగు
  • వ్యాపారవేత్త అజీమ్‌ఖాన్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్
  • అజీమ్‌పై లైంగిక వేధింపులే బ్రేకప్‌కు కారణం?
‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి సబా కమర్ వ్యాపారవేత్త అజీమ్‌ఖాన్‌ను పెళ్లాడడం లేదంటూ సంచలన ప్రకటన చేసింది. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం అయింది. అంతలోనే ఈ నిర్ణయం బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది.

వ్యక్తిగత కారణాల వల్లే నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చెబుతున్నట్టు పేర్కొన్న సబా.. తాము పెళ్లి చేసుకోవడం లేదని పేర్కొంది. తాను ఇప్పటి వరకు అజీమ్‌ఖాన్‌ను కలవలేదని, ఫోన్ల ద్వారా మాత్రమే మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని పేర్కొంది. సబాతో నిశ్చితార్థం తర్వాత అజీమ్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడమే బ్రేకప్‌కు కారణమని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సబా చేసిన ప్రకటనకు అజీమ్‌ఖాన్ స్పందించాడు. ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించాడు. దేవుడు ఆమెకు అన్నివేళలా విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ముళ్లబాట చివరికి అందమైన గమ్యస్థానానికి చేర్చుతుందని, బ్రేకప్ పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు అజీమ్ పేర్కొన్నాడు.
Bollywood
Pakistan
Actress Saba Qamar
Wedding

More Telugu News