ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

03-04-2021 Sat 08:48
  • కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు
  • కాసేపటికే ఇంజిన్‌లో మంటలు
  • ప్రయాణికులను దింపివేయడంతో తప్పిన పెను ప్రమాదం
APSRTC Bus engine catches fire in Kakinada

కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ‘ఇంద్ర’ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. బస్టాండ్ నుంచి బయలుదేరిన కాసేపటికే జెడ్పీ సెంటర్ సమీపంలో ఇంజిన్‌లో మంటలు రేగాయి. గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రయాణికులు అందరినీ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సు ఇంజిన్‌లో మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు.