హిందీ ప్రేక్షకులని పలకరించనున్న నాని సినిమా!
- మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి'
- నెగెటివ్ రోల్ పోషించిన నాని
- గతేడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- త్వరలో రిలీజ్ కానున్న హిందీ వెర్షన్
తన కెరీర్ కి పునాది వేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో కీలక పాత్రను పోషించగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం గతేడాది విడుదల కావలసివుండగా కరోనా కారణంగా థియేటర్లు మూతబడడంతో.. గత సెప్టెంబర్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్'లో డిజిటల్ ప్రీమియర్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను థియేటర్లలో పలకరించడానికి రెడీ అవుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలలో ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి, హిందీ ప్రేక్షకులు నాని చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!