7న కోర్టులో వాయిదా ఉండగా, 8న ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?: జనసేన నేత పోతిన మహేశ్

02-04-2021 Fri 16:11
  • ఏపీలో వివాదాస్పదంగా మారిన పరిషత్ ఎన్నికల అంశం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ
  • అఖిలపక్ష భేటీకి గైర్హాజరైన జనసేన, బీజేపీ
  • తాము ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశామన్న జనసేన నేత
  • 7వ తేదీన ఎస్ఈసీ కోర్టులో సమాధానం చెపాల్సి ఉందని వెల్లడి
Janasena leader Pothina Mahesh comments in Parishat elections

పరిషత్ ఎన్నికల అంశం కోర్టులో ఉండగానే ఎస్ఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ జారీ చేయడంపై జనసేన నేత పోతిన మహేశ్ స్పందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్వహించిన సమావేశాన్ని జనసేన బహిష్కరించిందని తెలిపారు. పరిషత్ ఎన్నికలపై జనసేన ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసిందని, ఆ పిటిషన్ పై ఈ నెల 7న ఎస్ఈసీ కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. 7వ తేదీన కోర్టులో వాయిదా ఉండగా, ఆ మరుసటి రోజే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని మహేశ్ ప్రశ్నించారు. కోర్టులంటే గౌరవం లేదా? అని వ్యాఖ్యానించారు.