ఆనంద్​ మహీంద్రాకు నటరాజన్​ రిటర్న్​ గిఫ్ట్​

02-04-2021 Fri 14:13
  • సంతకం చేసిన జెర్సీ కానుక
  • థార్ జీపును తీసుకున్న ఫాస్ట్ బౌలర్
  • నటరాజన్ సహా ఆరుగురికి కానుక ఇచ్చిన మహీంద్ర
  • నటరాజన్ భావోద్వేగ ట్వీట్
Natrarajan Adorable Return Gift To Anand Mahindra

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ నటరాజన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన శుభ్ మన్ గిల్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ లకు థార్ జీపులను గిఫ్ట్ గా ఇస్తున్నానంటూ ఆనంద్ మహీంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

గురువారం థార్ జీపును తీసుకున్న నటరాజన్.. ఆ ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆనంద్ మహీంద్రాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. తన జెర్సీపై సంతకం చేసి కానుకగా అందజేశాడు. ఇండియాకు ఆడడం తనకు దక్కిన గొప్ప గౌరవమని నటరాజన్ అన్నాడు. అనతికాలంలోనే ఇంత ఎత్తుకు ఎదగడం ఊహించలేనిదన్నాడు. ఇన్నాళ్లూ అందరూ తనపై ఎనలేని ప్రేమ, ఆప్యాయతలను చూపించారని అన్నారు. గొప్పగొప్పోళ్ల అండ, ప్రోత్సాహంతోనే తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగానన్నాడు.


థార్ లో ఇవ్వాళ ఇంటికి వెళ్తుంటే ఎంతో సంతోషంగా అనిపించిందని, తన సామర్థ్యాన్ని గుర్తించి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. క్రికెంట్ అంటే మీకున్న ఇష్టానికి.. చారిత్రక గబ్బా టెస్టులో తన జెర్సీనే మీకు మంచి కానుక అని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.