Jeevan Reddy: ఎంపీ అరవింద్ మీడియా ముందు పోజులు కొట్టడం కాదు... పసుపు రైతుల సమస్యలు తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి

Jeevan Reddy slams BJP MP Aravind
షార్ట్స్‌లో చూడండి
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై బీజేపీ ఎంపీ అరవింద్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పసుపు పంటకు మద్దతు ధర ఏదీ? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఎక్కడున్నారని నిలదీశారు. జగిత్యాలలో పసుపు పండితే తమిళనాడులో బోర్డు పెడతారా? అని అగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ మీడియా ముందు పోజులు కొట్టడం కాదని, పసుపు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని హితవు పలికారు.

గత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో అరవింద్ ప్రచారం సాగించారు. అయితే ఆయన గెలిచాక పసుపు బోర్డు అంశం ఎటూ తేలలేదు. దానికితోడు పసుపు బోర్డును కేంద్రం తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అరవింద్ పై విమర్శలు తీవ్రమయ్యాయి.

దీనిపై అరవింద్ ఓ కార్యక్రమంలో స్పందించారు. తమిళనాడు మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు బదులు రీజనల్ స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Jeevan Reddy
Arvind
Turmeric Board
Nizamabad
Telangana

More Telugu News