బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్.. రక్షించాలంటూ కేకలు
- రాత్రి పది గంటల సమయంలో కిడ్నాప్
- బైక్‌లపై వచ్చిన నిందితులు
- యువతి కేకలు విని అప్రమత్తమైన స్థానికులు
- అప్పటికే పరారైన దుండగులు
బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని బలవంతంగా బైక్‌పైకి ఎక్కించారు. దీంతో యువతి భయంతో రక్షించాలంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే బయటకు వచ్చారు. అయితే, అప్పటికే దుండగులు యువతిని తీసుకుని పరారయ్యారు. కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.