ఏపీకి నాలుగు రోజుల పాటు వర్ష సూచన
- ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం
- కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు
- కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.