Jammu And Kashmir: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్

Omar Abdulla tested positive and Modi wishes for speedy recovery
  • ట్విట్టర్‌‌ వేదికగా వెల్లడించిన ఒమర్ అబ్దుల్లా ‌
  • కుటుంబమంతా స్వీయ నిర్బంధంలోకి
  • ఫరూక్‌కు లక్షణాలు ఉన్నట్లు వెల్లడి
  • ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ
లోక్‌సభ ఎంపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫరూక్‌కు లక్షణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఇటీవల వారిని కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఫరూక్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
Jammu And Kashmir
Corona Virus
Farooq abdulla
Modi

More Telugu News