Hyderabad: హైదరాబాదులో కరోనా హాట్ స్పాట్స్ ఇవే!

GHMC announces Corona hot spots in Hyderabad
  • తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్న కేసులు
  • కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ కొనసాగినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా నగర పరిధిలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడి కోసం జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. మరోసారి నగరంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. నగరంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Hyderabad
GHMC
Corona Virus
Hot Spots

More Telugu News