కరోనా భయాల్లో కూడా దూసుకుపోయిన మార్కెట్లు.. 1,128 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!

30-03-2021 Tue 16:08
  • అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు
  • 338 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్
Sensex gains 1128 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్నప్పటికీ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లభించడంతో భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు  ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137కి పెరిగింది. నిఫ్టీ 338 పాయింట్లు ఎగబాకి 14,845కి చేరుకుంది. ఈ రోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.11%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.91%), ఇన్ఫోసిస్ (3.69%), ఎన్టీపీసీ (3.60%), హిందుస్థాన్ యూనిలీవర్ (3.59%).

సెన్సెక్స్ లో కేవలం మహీంద్రా అండ్ మహీంద్రా (-0.74%), యాక్సిస్ బ్యాంక్ (-0.41%), భారతి ఎయిర్ టెల్ (-0.17%).