Dr Ravi Kumar: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్

BJP finalised Dr Ravi Kumar as their contestant in Nagarjunasagar by polls
  • నోముల మృతితో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, టీఆర్ఎస్
  • తమ అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. నాగార్జునసాగర్ బరిలో తమ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.

సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నోముల కుమారుడు నోముల భగత్ కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగారు. కాగా, బీజేపీ అభ్యర్థి రేసులో కంకణాల నివేదితా రెడ్డి పేరు కూడా వినిపించింది. అధిష్ఠానం అభ్యర్థిని ఎంపిక చేయకముందే ఆమె నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
Dr Ravi Kumar
BJP
Nagarjuna Sagar Bypolls
Telangana

More Telugu News