భారత్‌లో అందుబాటులోకి రానున్న మరో టీకా
- క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన సీరం
- కోవావాక్స్ పేరిట సెప్టెంబరులో వచ్చే అవకాశం
- యూకే ట్రయల్స్‌లో 89 శాతం సమర్థత
- పేద, మధ్యాదాయ దేశాలకు సరఫరాయే లక్ష్యం
అమెరికా ఫార్మా సంస్థ నొవావాక్స్‌తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తోందని పూనావాలా తెలిపారు. భారత్ సహా పేద, మధ్యాదాయ దేశాల్లో సరఫరా చేయడానికి నొవావాక్స్‌తో సీరం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కొత్త రకాలైన ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని తెలిపారు. మొత్తంగా 89 శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు తేలిందని వివరించారు. ఈ టీకాపై యూకేలో ట్రయల్స్ జరిగాయన్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సీరం ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను భారత్‌లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలకూ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తోంది.