Neelam Sahni: ఏపీ సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా

Senior IAS Neelam Sahni resigns for CM Adviser post
  • ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్నీ
  • ఈ నెల 31తో ముగియనున్న నిమ్మగడ్డ పదవీకాలం
  • అదే రోజున బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్నీ
  • ఇప్పటివరకు సీఎం సలహాదారుగా కొనసాగిన సాహ్నీ
ఏపీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా నీలం సాహ్నీ నియమితులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఈసీగా నియమితురాలైన నేపథ్యంలో సలహాదారు పదవికి ఆమె నేడు రాజీనామా చేశారు. సాహ్నీ రాజీనామాను సర్కారు ఆమోదించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో ఆమె నూతన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31తో ముగియనుండగా, తదనంతరం అదే రోజున ఆమె కొత్త పదవిలోకి వస్తారు. కాగా ఎస్ఈసీగా నియమితురాలైన నీలం సాహ్నీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
Neelam Sahni
CM Adviser
Andhra Pradesh
SEC
Nimmagadda Ramesh Kumar

More Telugu News