వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి.. భగవంతుడి దయవల్ల ఆరోగ్యంగా ఉన్నాను: విజ‌య‌సాయిరెడ్డి
Add ap7am to your home Screen

వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి.. భగవంతుడి దయవల్ల ఆరోగ్యంగా ఉన్నాను: విజ‌య‌సాయిరెడ్డి

tested corona negtive says saireddy
  • మార్చి 26న కొవిడ్ టెస్ట్ (ఆర్టీపీసీఆర్)లో నెగిటివ్ వచ్చింది
  • కొంద‌రు ఫోన్ కాల్స్ చేస్తున్నారు
  • అన్ని పారామీటర్స్ బాగున్నాయి
త‌న ఆరోగ్యం పట్ల జరుగుతున్న ప్ర‌చారంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. త‌న గురించి వ‌స్తోన్న వదంతుల‌ను నమ్మ‌వద్దని కోరారు.

"భగవంతుని ఆశీర్వాదంతో శుక్రవారం మార్చి 26న కొవిడ్ టెస్ట్ (ఆర్టీపీసీఆర్)లో నెగిటివ్ వచ్చింది. నాకు కొవిడ్ పాజిటివ్ అని మిత్రులు, శ్రేయోభిలాషులు పరామర్శగా ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి. భగవంతుని దయవల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. అన్ని పారామీటర్స్ బాగున్నాయి'' అని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

కాగా, గ‌త ఏడాది సెప్టెంబ‌రులో విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా సోకడం.. అనంత‌రం కోలుకోవడం తెలిసిందే. త‌న‌ ఆరోగ్యం గురించి మ‌ళ్లీ ప‌లు ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో విజ‌య‌సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.
Corona Virus
COVID19
Vijay Sai Reddy
YSRCP

More Telugu News