Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా పాజిటివ్!

21 Positive Cases in One Family in East Godavari Dist
  • ఏపీలో పెరుగుతున్న రోజువారీ కేసులు
  • తొండంగి మండలంలో కుటుంబమంతటికీ కరోనా
  • అందరినీ ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాడే ఏపీలో 758 మందికి కరోనా సోకగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఒకే కుటుంబంలోని 21 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ కుటుంబంలోని ఓ విద్యార్థి, రాజమహేంద్రవరంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఇటీవల అతను ఇంటికి వచ్చాడు. ఆపై ఇంట్లోని వారంతా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రతి ఒక్కరికీ జ్వరం, జలుబు వంటి సమస్యలు రాగా, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు, మొత్తం అందరికీ కరోనా సోకినట్టుగా నిర్ధారించారు.

దీంతో వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు, గడచిన మూడు నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
Andhra Pradesh
East Godavari District
corona
One Family

More Telugu News