aiadmk: అన్నాడీఎంకేలోకి శ‌శిక‌ళ ఎంట్రీ వార్త‌ల‌పై స్పందించిన విజ‌య‌శాంతి!

vijaya shanti on sasikala entry in aiadmk
  • బీజేపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నంలో వివేకం ఉంది
  • భవిష్యత్ విజ్ఞత కూడా ఉంది
  • తమిళనాట ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి
త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత స‌న్నిహితురాలు శశికళ మ‌ళ్లీ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందంటూ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. శ‌శికళ అన్నాడీఎంకేలో ఉండాలని బీజేపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నంలో వివేకం, భవిష్యత్ విజ్ఞత ఉన్నాయ‌ని విజ‌య‌శాంతి చెప్పారు.

ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే నేతలు పొరపాటు చేసినట్లు భావిస్తున్న ధోరణి నేటి వార్తలలో కనిపిస్తోందని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఏది ఏమైనా తమిళనాట ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజ‌య‌శాంతి తెలిపారు.  

కాగా,  త‌మిళ‌నాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శశికళ పట్ల సానుకూలత కనబరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆంధ్ర‌జ్యోతిలో పేర్కొన్నారు. అయితే, ముందస్తు వ్యూహంలో భాగంగానే ఆయన అలా మాట్లాడారని రాజకీయవర్గాలు చెబుతున్నాయని ఆ వార్తలో వివరించారు.
aiadmk
Sasikala
Vijayashanti
BJP

More Telugu News