West Bengal: ముస్లిం ఓట్ల కోసం బీజేపీ మద్దతుతో బెంగాల్​ లో ఇంకో కొత్త పార్టీ వస్తోంది: మమతా బెనర్జీ

Mamata Banerjee Cautions Bengal About New Political Party Backed By BJP
  • ఆ పార్టీ నేత డబ్బులు తీసుకున్నారని ఆరోపణ
  • ఆ పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దంటూ పిలుపు
  • సీపీఐ, కాంగ్రెస్ లూ బీజేపీతో ఒప్పందం చేసుకున్నాయని విమర్శ
మైనారిటీలను చీల్చి ఓట్లను కొల్లగొట్టేందుకు బెంగాల్ లో మరో కొత్త పార్టీని బీజేపీ వెనకేసుకొస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీ పేరేంటో, ఆ పార్టీలోని వ్యక్తులెవరో చెప్పకుండానే ఆమె ఈ ఆరోపణలు చేశారు. దక్షిణ 24 పరగణ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు.. బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె అన్నారు.

‘‘రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. బీజేపీకి లాభం చేసేందుకు, మైనారిటీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ తోడ్పడుతుంది. కాబట్టి ఆ పార్టీకెవరూ ఓటు వేయొద్దు’’ అని వ్యాఖ్యానించారు. సీపీఎం, కాంగ్రెస్ లు కూడా బీజేపీతో ఒప్పందం చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్పీఆర్ లను అమలు కాకుండా చూడగలిగే ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్సేనని, అన్ని వర్గాల మధ్య స్నేహ బంధాన్ని నిలిపేది కూడా తామేనని అన్నారు.
West Bengal
Mamata Banerjee
BJP

More Telugu News