'లవ్ స్టోరీ' చిత్రం నుంచి 'ఏవో ఏవో కలలే' గీతాన్ని విడుదల చేసిన మహేశ్ బాబు

25-03-2021 Thu 13:58
  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం
  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ'
  • సోషల్ మీడియాలో పాటను లాంచ్ చేసిన మహేశ్ బాబు
  • పవన్ సీహెచ్ బాణీలు
  • సాహిత్యం అందించిన భాస్కరభట్ల
Mahesh Babu launch Evo Evo Kalale song from Love Story
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లవ్ స్టోరీ'. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట రిలీజైంది. 'ఏవో ఏవో కలలే' అనే గీతాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 'ఏవో ఏవో కలలే' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. నిర్మాత నారాయణ దాస్ నారంగ్ తో పాటు యావత్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

'ఏవో ఏవో కలలే' గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా వస్తున్న 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజైన 'సారంగ దరియా' గీతం విశేషరీతిలో ప్రజాదరణ పొందింది.