Jagga Reddy: కూతురితో క‌లిసి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి నిర‌స‌న‌

jaggareddy protest at lower tankbond
  • లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌
  • సంగారెడ్డి పేద‌ల‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ 
  • అసెంబ్లీ వ‌ర‌కు పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్తున్నారు. సంగారెడ్డికి వైద్య క‌ళాశాల కేటాయించాల‌ని, అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆయ‌న చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే, త‌న‌ నియోజక వర్గంలో 40,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, అభివృద్ధికి రూ.2,000 కోట్లు మంజూరు చేయాలని అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయ‌న ముందుగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఈ రోజు ఉద‌యం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసనకు దిగారు. సంగారెడ్డి పేద‌ల‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంత‌రం అక్కడి నుంచి అసెంబ్లీకి బ‌య‌లుదేరారు.
Jagga Reddy
Congress
Hyderabad

More Telugu News