Kangana Ranaut: 'దేన్నీ సీరియస్ గా తీసుకోరు?'... రామ్ గోపాల్ వర్మ పొగడ్తలపై స్పందించిన కంగనా రనౌత్!

Kangana Latest Comments on Ramgopal Varma
  • ఇటీవల విడుదలైన 'తలైవి' ట్రయిలర్
  • సెల్యూట్ చేస్తున్నానన్న వర్మ
  • మీ దృక్పథాన్ని అభినందిస్తానన్న కంగన
కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన 'తలైవి' చిత్రం ట్రయిలర్ విడుదల కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, కంగనపై పొగడ్తల వర్షం కురిపించిన వేళ, కంగన కూడా తనదైన శైలిలో స్పందించింది.

కంగన 34వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రయిలర్ విడుదల కాగా, "హాయ్ కంగనా అండ్ టీమ్. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, కొన్ని విషయాల్లో నిన్ను నేను వ్యతిరేకించవచ్చు. అయితే, ఇంత సూపర్ డూపర్ స్పెషల్ క్యారెక్టర్ ను చేసినందుకు నీకు సెల్యూట్ చేస్తున్నాను. తలైవి ట్రయిలర్ మైండ్ బ్లోయింగ్. స్వర్గంలో ఉన్న జయలలిత కూడా దీన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు" అని వ్యాఖ్యానించారు.

ఇక దీన్ని చూసిన కంగన స్పందిస్తూ, "హాయ్ సార్. నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదు. గర్వం, ఈగో నిండిపోయిన ఈ ప్రపంచం ఎంతో సులువుగా మనసులను బాధిస్తుంది. ఈ సమయంలో మీరు చూపే దృక్పథాన్ని నేను అభినందిస్తాను. మీరు దేన్నీ సీరియస్ గా తీసుకోరు. మిమ్మల్ని మీరు కూడా. మీ పొగడ్తలకు కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించింది.
Kangana Ranaut
Ram Gopal Varma
Thalaivi

More Telugu News