Corona Virus: దేశంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్ 10 జిల్లాలు ఇవే!

  • దేశంలో 3,68,457కి చేరుకున్న యాక్టివ్ కేసులు
  • పూణె జిల్లాలో 43,590 కేసులు
  • బెంగళూరు అర్బన్ జిల్లాలో 10,766 యాక్టివ్ కేసులు
Top 10 districts with highest Corona active cases

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి మూడున్నర లక్షల మార్కును దాటిన యాక్టవ్ కేసులు... 3,68,457కి చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కేసులు 10 జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ 10 జిల్లాల్లో తొమ్మిది మహారాష్ట్ర జిల్లాలు ఉండగా, కర్ణాటకకు చెందిన ఒక జిల్లా ఉంది. టాప్ 10 జిల్లాల్లో పూణె అగ్రస్థానంలో ఉంది.

జిల్లాలు, యాక్టివ్ కేసుల వివరాలు:

  • పూణె - 43,590
  • నాగపూర్ - 33,160
  • ముంబై - 26,599
  • థానే - 22,513
  • నాసిక్ - 15,710
  • ఔరంగాబాద్ - 15,380
  • బెంగళూరు అర్బన్ - 10,766
  • నాందేడ్ - 10,106
  • జల్గావ్ - 6,087
  • అకోలా - 5,704

మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్ లతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

More Telugu News