Mumbai: ముంబైపై కరోనా పంజా.. ఒక్క రోజే 5 వేలకు పైగా కేసుల నమోదు

Mumbai records 5190 Corona new cases in a single day
  • మహారాష్ట్రలో ఒక్కరోజే 31,855 కరోనా కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 95 మంది మృతి
  • ముంబైలో 5,190 మందికి కరోనా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా 31,855 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఇక గత 24 గంటల్లో మహారాష్ట్రలో 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన కేసుల సంఖ్య 25,64,881కి చేరుకుంది. ఇదే సమయంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో 5,190 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ముంబైలో నమోదైన కేసుల సంఖ్య 3,74,641కి చేరుకుంది.

మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధించింది.
Mumbai
Maharashtra
Corona Virus
Updates

More Telugu News