Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై ఆ రోజు దాడి జరగలేదు: పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నివేదిక

Vijayasai Reddys complaint is false says Parliament Privilege Committee
  • విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి జరిగిందని విజయసాయి ఫిర్యాదు
  • ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవన్న ప్రివిలేజ్ కమిటీ
  • ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని నివేదిక
తనపై దాడి జరిగిందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నివేదికను సమర్పించింది. 26 జనవరి 2017న విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి జరిగిందంటూ ఆయన చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని పార్లమెంటు సభాహక్కుల సంఘం తేల్చింది. పార్లమెంటు సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలతో లోక్ సభకు 70వ నివేదికను సభాహక్కుల సంఘం సమర్పించింది.

విజయసాయిరెడ్డిపై దాడి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం తెలిపింది. విజయసాయిది తప్పుడు ఫిర్యాదుగా భావిస్తున్నామని చెప్పింది. ఆధారాలు లేని కారణంగా ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది.
Vijayasai Reddy
Vizag Airport
Attack
Parliament
Privilege Committe

More Telugu News