Maharashtra: మహారాష్ట్రలో విందు రాజకీయం... బీజేపీకి కూడా ఆహ్వానాలు పంపిన శివసేన నేత సంజయ్ రౌత్!

Shiv Sena sends invitation to BJP MLAs for dinner party
  • మహా రాజకీయాల్లో కలకలం రేపుతున్న హోంమంత్రి వ్యవహారం
  • విందు రాజకీయానికి తెరలేపిన శివసేన
  • డిన్నర్ పార్టీకి హాజరవుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్న బీజేపీ... శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో థాకరే ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, పరిస్థితిని చక్కదిద్దేందుకు శివసేన విందు రాజకీయానికి తెరలేపింది. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఈరోజు తన నివాసంలో డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. మరోవైపు, ఈ విందుకు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ డిన్నర్ పార్టీ తర్వాత మహా రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.
Maharashtra
Shiv Sena
Sanjay Raut
Dinner Party
BJP

More Telugu News