Tamil Nadu: గెలిపిస్తే చంద్రమండలానికి తీసుకెళతాడట... తమిళనాడులో విచిత్రమైన హామీలు!

Indipendent candidate in Tamil Nadu gives sensational promise
  • విచిత్రమైన హామీలను గుప్పిస్తున్న స్వతంత్ర అభ్యర్థి శరవణన్ 
  • మధురై సమీపంలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాడట
  • ఇంటి పనుల సాయం కోసం ప్రతి ఇంటికీ ఒక రోబోను ఇస్తాడట
ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునే హామీలు ఇవ్వడంలో తమిళనాడుకు మరే రాష్ట్రం సాటిరాదు. ఊహించని విధంగా ఉచితాలు ఇవ్వడం తమిళనాడులోనే ప్రారంభమైందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మధురై నుంచి పోటీ  చేస్తున్న శరవణన్  అనే స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన హామీకి అందరూ ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇది ఆషామాషీ హామీ కాదు.

ఇంతకీ అదేమిటంటే.. తనకు ఓటు వేసి గెలిపిస్తే... నియోజకవర్గంలోని అందరినీ విడతలవారీగా చంద్రమండలానికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాదు, దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి కూడా క్లియర్ గా చెప్పాడు. చంద్రమండలంకు తీసుకెళ్లేందుకు మధురై సమీపంలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెబుతున్నాడు.

అంతేకాదండోయ్... ఇంట్లో ఆడవారికి వారి పనులకు సాయం చేసేందుకు ప్రతి ఇంటికి ఒక రోబోను కూడా ఇస్తానని ఆయన మరో హామీ ఇచ్చాడు. ఆయన హామీలకు నియోజకవర్గంలోని ఓటర్లు కూడా షాక్ కు గురవుతున్నారట. మరి, ఈ స్థాయిలో హామీలిచ్చిన ఈయనకు ఏమేరకు ఓట్లేస్తారో చూడాలి!  
Tamil Nadu
Assembly Elections
Madhurai
Independent Candidate
Moon

More Telugu News