ఏపీలో కొత్తగా 492 కరోనా కేసుల నమోదు... ఇద్దరి మృతి

23-03-2021 Tue 17:31
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 168 కేసులు  
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2,616
AP Corona Cases Update

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మరింత అధికమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా... 492 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఇక ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు గుర్తించారు. జిల్లాలోని రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,616 మంది చికిత్స పొందుతున్నారు.