Telangana: కరోనా భయాలు.. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!

All schools in Telangana will shutdown from tomorrow
  • తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా విస్తరణ
  • విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన 
చివరకు అందరూ ఊహించిందే జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి  వైద్య విద్యాసంస్థలు మినహా  రాష్ట్ర వ్యాప్తంగా  మిగిలిన  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, హాస్టల్స్, గురుకుల విద్యాలయాలను  మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబిత, విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు చర్చలు జరిపారు. విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న అంశంపై చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించిన ముఖ్యమంత్రి... విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయం మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
Telangana
Schools
Shutdown

More Telugu News