Jayaram: మహేశ్ బాబుకి తండ్రిగా మలయాళ నటుడు!

Malayalam actor jayaram to play father of Mahesh Babu
  • తెలుగులో కీలక పాత్రలు పోషిస్తున్న జయరామ్ 
  • 'రాధే శ్యామ్', 'హరిహర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు
  • 'సర్కారు వారి పాట'లో బ్యాంక్ మేనేజర్ పాత్ర  
కేవలం హీరోయిన్.. విలన్ వంటి వేషాలకే కాకుండా కొన్ని కీలకమైన క్యారెక్టర్లకు కూడా మన వాళ్లు ఇతర భాషల నటులను ఇటీవలి కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ విధంగా ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కూడా ఇటీవల తెలుగు సినిమాలలో కొన్ని పాత్రలలో కనిపిస్తున్నారు. ఆమధ్య 'అల వైకుంఠ పురములో' సినిమాలో ఆయన నటించారు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' పవన్  కల్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాలలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు మహేశ్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రకు జయరామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో జయరామ్ నటిస్తున్నారు. మహేశ్ బాబుకి తండ్రిగా, బ్యాంక్ మేనేజర్ పాత్రలో ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యాక జయరామ్.. మహేశ్ సినిమాలో జాయిన్ అవుతాడట.

ఇటీవలి కాలంలో మన బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
Jayaram
Mahesh Babu
Keerti Suresh
Parashuram

More Telugu News