Corona Virus: బెల్లంపల్లిలో కరోనా కలకలం... పాలిటెక్నిక్ కాలేజీలో 21 మందికి పాజిటివ్

Corona scare in Bellampally polytechnic college
  • ఇప్పటికే తెలంగాణలో పలు విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి
  • బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో 146 మందికి కరోనా పరీక్షలు
  • విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ కరోనా
  • కరోనా సోకిన వారికి ఐసోలేషన్
  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
తెలంగాణలోని పలు విద్యాసంస్థల్లో కరోనా వైరస్ ప్రబలుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది. ఆ కాలేజీలో విద్యార్థులు, సిబ్బందితో కలిపి 146 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...  21 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 8 మంది విద్యార్థులు కాగా, 13 మంది సిబ్బంది ఉన్నారు.

సిబ్బందిలో 10 మంది ఉపాధ్యాయులు కాగా, ఒక వంట మనిషి, వాచ్ మన్, డ్రైవర్ ఉన్నారు. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్ కు తరలించనున్నారు. కాలేజీలో కరోనా కలకలం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Corona Virus
Bellampally
Polytechnic College
Manchiryal
Telangana

More Telugu News