Somu Veerraju: నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుక టెండర్ ఇచ్చి 30 లక్షల మంది కడుపుకొడుతున్నారు: సోము వీర్రాజు

  • ఏపీలో ఇసుక తవ్వకాలు ప్రైవేటు సంస్థకు అప్పగింత
  • తిరుపతిలో బీజేపీ నిరసన ప్రదర్శన
  • ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
  • కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్న సోము వీర్రాజు
Somu Veerraju questions AP Govt over new sand policy

ఏపీలో ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణ, అమ్మకాలను ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ప్రజలకు ఇసుక ఉచితంగా ఇస్తామని నమ్మించారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇసుక కోసం ప్రజల్ని ఎన్నో కష్టాలకు గురిచేశారని ఆయన విమర్శించారు.

ఇక ఇప్పుడు కొత్తగా నష్టాల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు ఇసుక టెండర్ ఇచ్చేశారని, తద్వారా 30 లక్షల మంది కార్మికుల కడుపుకొట్టే పనిని జగన్ ప్రభుత్వం చేస్తోందని వ్యాఖ్యానించారు. నూతన ఇసుక విధానం కారణంగా రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.

కొత్త ఇసుక విధానాన్ని వెనక్కి తీసుకునేంతవరకు బీజేపీ ప్రజల తరఫున పోరాడుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీనిపై తిరుపతిలో బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ ఎలక్ట్రానిక్ తూకం యంత్రంపై ఓ పాత్రలో ఇసుకను, మరో పాత్రలో డబ్బు కట్టలను ఉంచి ప్రభుత్వ విధానంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

More Telugu News