India: తొలి వన్డేలో భారీ స్కోరు దిశగా భారత్... 31 ఓవర్లలో 164/1

India salis to huge total in Pune against England
  • పూణేలో భారత్, ఇంగ్లండ్ తొలి వన్డే
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • తొలి వికెట్ కు 64 రన్స్ జోడించిన రోహిత్, ధావన్
  • స్టోక్స్ బౌలింగ్ లో రోహిత్ అవుట్
  • అర్ధసెంచరీలతో క్రీజులో ఉన్న ధావన్, కోహ్లీ
ఇంగ్లండ్ తో పుణే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 31 ఓవర్ల అనంతరం భారత్ 1 వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 81, కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 పరుగులతో ఆడుతున్నారు.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 64 పరుగులు నమోదు చేశారు. అయితే స్టోక్స్ బౌలింగ్ లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వెనుదిరగ్గా... ధావన్ తో జత కలిసిన కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు ఉరికించాడు. ఈ క్రమంలో మరోసారి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ధావన్ అంతకుముందే ఫిఫ్టీ సాధించి వన్డేల్లో తన ఓపెనర్ స్థానానికి న్యాయం చేశాడు.
India
England
1st ODI
Pune

More Telugu News