టీమిండియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్
- భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్
- పూణే వేదికగా మ్యాచ్ లు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణకు స్థానం
ఈ వన్డే మ్యాచ్ లో టీమిండియా తరఫున ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్య అరంగేట్రం చేయనున్నారు. స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ కు చోటిచ్చారు. శిఖర్ ధావన్ మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక, ఇంగ్లండ్ జట్టులో బ్యాట్స్ మన్ శామ్ బిల్లింగ్స్ ను తీసుకున్నారు.