Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి రెండు సరికొత్త బైక్‌లు.. ధర ఎంతంటే..!

Two new bikes from Royal Enfield
  • కొత్త ఫీచర్లతో వచ్చిన ఇంటర్‌సెప్టార్‌ 650, కాంటినెంటల్ జీటీ 650
  • అదనపు రంగుల్లో లభ్యం
  • మన అభిరుచులకు అనుగుణంగా తయారు చేయించుకునే అవకాశం
  • ఇంటర్‌సెప్టార్‌ ప్రారంభ ధర రూ.2,75,467
  • కాంటినెంటల్‌ ధర శ్రేణి రూ.2,91,701-రూ.3,13,367
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సోమవారం 2021 ఇంటర్‌సెప్టార్‌ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త బైక్‌లను విడుదల చేసింది. అదనపు కలర్లతో పాటు కొన్ని అధునాతన ఫీచర్లను వీటికి జతచేసి సరికొత్తగా తీర్చిదిద్దారు. అలాగే ఆసక్తికర వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా బైక్‌ను తయారు చేయించుకునేలా ‘మేక్‌ ఇట్ యువర్స్‌(ఎంఐవై)’ సదుపాయం కల్పించారు. ఇందులో భాగంగా సీట్లు, సంప్‌ గార్డులు, టూరింగ్‌ అద్దాలు, ఫ్లై స్క్రీన్‌ వంటి పరికరాల్లో మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

ఇంటర్‌సెప్టార్ 650.. కెనియన్‌ రెడ్‌, వెంచురా బ్లూ అనే రెండు స్టాండర్ట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. అలాగే డౌన్‌టౌన్ డ్రాగ్‌, సన్‌సెట్‌ స్ట్రిప్‌ అనే రెండు కస్టమ్‌ కలర్లలో కూడా బైక్ లభించనుంది. ఇక ఇప్పటికే ఉన్న సింగిల్‌ టోన్‌ ఆరెంజ్‌ క్రష్‌, డ్యుయల్‌ టోన్‌ బేక్ ఎక్స్‌ప్రెస్‌ రంగుల్లో కూడా ఇది అందుబాటులో ఉంది.

ఇక కాంటినెంటల్‌ జీటీ 650 మొత్తం ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. రాక్‌ రెడ్‌ స్టాండర్డ్‌, బ్రిటీష్‌ రేసింగ్‌ గ్రీన్‌ స్టాండర్డ్‌, డక్స్‌ డీలక్స్‌, వెంచురా స్టోర్మ్‌ రంగుల్లో ఈ బైక్‌ లభించనుంది.

ఇక ధర విషయానికి వస్తే ఇంటర్‌సెప్టార్‌ 650 ధర శ్రేణి రూ.2,75,467-రూ.2,97,133 మధ్య ఉంది. కాంటినెంటల్‌ ధర రూ.2,91,701-రూ.3,13,367గా
నిర్ణయించారు.

Royal Enfield
Interceptor 650
Continental GT 650
MiY options

More Telugu News