సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్టీ పోటీల సందర్భంగా అపశ్రుతి... కుప్పకూలిన ప్రేక్షకుల గ్యాలరీ!
- నేడు కబడ్డీ పోటీలు ప్రారంభం
- గ్యాలరీ కూలడంతో 150 మందికి గాయాలు
- ఆసుపత్రులకు తరలించిన పోలీసులు, 108 సిబ్బంది
- సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఘటన
ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో దాదాపు 1,500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిని 108 సిబ్బంది, పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. కాగా జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు.